epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పార్కిన్ సన్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలి?

మానవ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే మెదడు సంబంధిత వ్యాధి పార్కిన్ సన్స్(Parkinson Disease). ఇది మన రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చలనశీలత, మానసిక ఆరోగ్యం, నిద్ర, నొప్పులు ఇలా అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని అతలాకుతలం చేస్తాయి. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? అంటే ఇది ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతుంది. మెదడులోని కొంత భాగాన్ని క్షీణింపజేస్తుంది. కాలక్రమేణా దీని లక్షణాలు తీవ్రతరం అవుతాయి. ఇది మన నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో వణుకు, నడవడానికి ఇబ్బంది, ఇన్‌బ్యాలెన్స్, బలహీనత, మానసిక ఆరోగ్య రుగ్మత, నిద్ర రుత్మతలు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ వ్యాధిని ఎలా నివారించాలంటే..

ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని పూర్తిగా నివారించం కుదరదు. కానీ, మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని కంట్రోల్ చేయొచ్చని వైద్యులు చెప్తున్నారు. వాటిలో అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిది శారీరక శ్రమ.

అవును.. శారీరక శ్రమ చేయడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది పార్కిన్‌ సన్స్(Parkinson Disease) వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందుకు వాకింగ్, రన్నింగ్, డ్యాన్స్ వంటివి చేయాలి. అలాగని వీటిని అతిగా చేసినా సమస్యలు తప్పవని వైద్యులు చెప్తున్నారు.

ఆహారంలో మార్పులు..

కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. రక్తపోటు, షుగర్, కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా పార్కిన్స్ సన్స్‌ను నివారించవచ్చు. పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు మెదడుకు పని కల్పించడం కోసం పజిల్స్, గేమ్స్, చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం వంటివి కూడా చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి జీవశైలి సంబంధిత మార్పులు చేసుకోవడం ద్వారా పార్కిన్ సన్స్‌ను నియంత్రించగలమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

Read Also: క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా.. ?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>