కలం, వెబ్ డెస్క్ : హుస్నాబాద్(Husnabad) లో అక్రమ గ్యాస్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. పలు ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్ దుకాణాలపై పోలీసులు అకస్మాత్తుగా సోదాలు (Police Raids) నిర్వహించగా, ఒక దుకాణంలో భారీగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు.
అంతేకాక, అదే దుకాణంలో 5 కేజీల గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ నింపుతున్న నిర్వాహకుడు పోలీసులకు చిక్కాడు. భద్రతా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ అక్రమ వ్యవహారం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో భాగంగా డొమెస్టిక్ సిలిండర్లతో పాటు 5 కేజీల 20 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిర్వాహకుడిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.
Read Also: బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్ మూవీలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్!
Follow Us On: Facebook

