సంచలనం .. లివ్-ఇన్ రిలేషన్ కు ఇకపై రిజిస్ట్రేషన్ తప్పనిసరి!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ ( Live In Relationships) ఎక్కువగా పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకోవడం కంటే లివ్-ఇన్ రిలేషన్ సో కంఫర్టబుల్ అంటూ చాలా మంది ఈ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇద్ధరి మధ్య మనస్పర్థలు వస్తే విడిపోవడానికి సులభంగా ఉండే ఈ కల్చర్ ను ఫాలో అవుతుంటారు. దీంతో లివ్ ఇన్ రిలేషన్ జంటలో ఎవరో ఒకరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాగే వారికి పుట్టిన సంతానం అనాథలవుతుంటారు. ఈ నేపథ్యంలోనే  లివ్-ఇన్ జంటల భద్రతను కాపాడటానికి గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code – UCC)ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.

తాజా చట్టం ప్రకారం.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకునే జంటలు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రార్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. లివింగ్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించిన ఒక నెలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయని వారికి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ విడిపోవాలని నిర్ణయించుకున్నా ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయాలి. ఈ నిబంధనలను పాటించకపోతే 3 నెలల వరకు జైలు శిక్ష , రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు.

అయితే రిజిస్ట్రేషన్ సమయంలో లివ్-ఇన్ రిలేషన్ జంట వ్యక్తులు మైనర్లు కాదని, వివాహితులు కాదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా జంటల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడుతుంది. దీంతో సదరు వ్యక్తులకు భద్రత, రక్షణ కల్పించబడుతోంది. ఈ చట్టం ద్వారా లివ్-ఇన్ భాగస్వామి మోసం చేస్తే సదరు మహిళ మెయింటెనెన్స్ పొందే హక్కును కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ బంధం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన వారసత్వ హోదా కూడా లభిస్తుంది.లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు చట్టవిరుద్ధం కాదని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు తీర్పు వెలువరించిన వేళ లివ్-ఇన్ రిలేషన్ లను గుజరాత్ ప్రభుత్వం నియంత్రిత, చట్టబద్దమైన ప్రక్రియగా మార్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో  గుజరాత్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ‘యూనిఫాం సివిల్ కోడ్- 2026’ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>