కలం, వెబ్ డెస్క్ : డబ్బు ఆర్జనే లక్ష్యంగా అక్రమార్కులు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. రంగులు, రసాయనాలతో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను మార్కెట్లో అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కల్తీ రాయుళ్లు మారడం లేదు. గుట్టుగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని అత్తాపూర్ (Attapur) లో నకిలీ ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
జై బోలేనాథ్ పేరుతో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఐస్ క్రీమ్ తయారీలో ఆరోగ్యానికి హానికరమైన కలర్స్, కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అసలైన భోలేనాథ్ బ్రాండ్ పేరును ఉపయోగిస్తూ అక్రమార్కులు నకిలీ ఐస్ క్రీమ్ ను తయారు చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Read Also: హుస్నాబాద్‌లో అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లు సీజ్
Follow Us On: Facebook

