Mobile Popup Ad
Mobile Popup Ad

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో బుమ్రా, సంజూ శామ్సన్

కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా, ఐసీసీ (ICC) మార్చి నెలకు గానూ ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినీలను ప్రకటించింది. సోమవారం వెల్లడించిన ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సంజూ శామ్సన్‌లతో పాటు దక్షిణాఫ్రికా వర్ధమాన బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుజెన్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్‌లో సంజూ శామ్సన్ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించారు. వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేయడమే కాకుండా, సెమీఫైనల్, ఫైనల్‌లో వరుసగా 89 పరుగులు సాధించి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మార్చి నెలలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో శామ్సన్ 137.50 సగటుతో 275 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నారు.

మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో కేవలం 15 పరుగులకే 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచారు. కీలకమైన నాకౌట్ దశల్లో బుమ్రా వేసిన స్పెల్స్ భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ ఇద్దరు భారతీయులకు దక్షిణాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుజెన్ గట్టి పోటీ ఇస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తన అరంగేట్ర టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేసిన ఆయన, దక్షిణాఫ్రికా 3-2తో సిరీస్ నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించారు. నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌లో 75 పరుగులతో రాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.

Read Also: నేను విదేశీ ప్లేయర్‌నా?: వైరల్ జోక్స్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>