కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. భద్రతా సిబ్బంది ఉండగానే ఓ కారు అసెంబ్లీలోకి అనుమానాస్పదంగా దూసుకెళ్లింది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది. మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కారు నడుపుతూ వచ్చి నేరుగా అసెంబ్లీ గేటును దాటుకొని వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కారు యూపీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. కారులో వచ్చిన వ్యక్తి నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లి స్పీకర్ కారుపై పూల బొకే ఉంచి.. ఇంక్ చల్లినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. అయితే ప్రస్తుతం వరకు బొకేలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ (Delhi Assembly) వద్ద భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా? ఈ ఘటన ఆకతాయి చేసిన పనా? లేదంటే ఏదైనా కుట్ర దాడి ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.
Read Also: ఎన్నికల ముందు మరో పెహల్గామ్ ఘటన: మమతా బెనర్జీ
Follow Us On: Instagram

