కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐబొమ్మ రవి (Ibomma Ravi)కి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా జైలులో ఉన్న అతనికి విముక్తి లభించినప్పటికీ, న్యాయస్థానం కొన్ని నిబంధనలను విధించింది.
ఐబొమ్మ రవి ప్రతిరోజూ సీసీఎస్ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని న్యాయమూర్తి తెలిపారు. అలాగే నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు, అతని పాస్‌పోర్టును వెంటనే కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించారు. విచారణ జరుగుతున్న సమయంలో దేశం విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
Read Also: కొలువుదీరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. మంత్రిగా హిందూ ఎంపీ
Follow Us On: X(Twitter)


