కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రజల తీర్పును అపహాస్యం చేసి నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూర్ మున్సిపాలిటీ (Thorrur Municipality) చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావొద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
మెజారిటీ బలం ఉన్నా కాంగ్రెస్ అధికారం బలంతో మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని ఆరోపించారు. విప్ జారీ చేయాల్సిన తనను అడ్డుకుని ఇండియా పౌరసత్వం లేని జాన్సీరెడ్డిని మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. మా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసారు. ఆఖరికి నా భార్యను కూడా అరెస్ట్ చేసారని.. అసలు రాష్టంలో ప్రజాస్వామ్యం ఉందా తలుచుకుంటే ఏడుపొస్తుందని ఆయన (Errabelli Dayakar Rao) కన్నీరు పెట్టారు.
కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు!
“Should I Stay or Leave?”: Ex-Minister Errabelli Dayakar Rao Breaks Down in Tears#ErrabelliDayakarRao #BRS #Thorrur #ErrabelliArrest #ErrabelliEmotional #Errabelli #Kalam #Kalamdaily #Kalamtelugu #Kalam360Degrees pic.twitter.com/PWrI3hGgRw— Kalam Daily (@kalamtelugu) February 17, 2026
Read Also: జాతిపిత అని కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు : కేటీఆర్
Follow Us On : WhatsApp


