కలం, డెస్క్ : తాను జాతిపితను అని మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎన్నడూ చెప్పుకోలేదన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ఎన్నడూ జాతిపితను అని చెప్పుకోలేదు. కాకపోతే తెలంగాణ జాతికి స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని జాతిపిత అని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటున్నారు. దాని నిర్వచనం తెలంగాణ ఉద్యమ కారుల మీదకు తుపాకులు ఎక్కుపెట్టిన వారికి ఎలా తెలుస్తుంది’ అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని.. ఒకటి ఉద్యమకారుల జాతి అయితే రెండోది తెలంగాణ ద్రోహుల జాతి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి. గిరిగీసి కొట్లాడే కేసీఆర్ జాతి మాది. జై తెలంగాణ అని కూడా అనలేని కిరాయి సర్కార్ కు తెలంగాణ వాదుల భావాలు ఎలా అర్థం అవుతాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనమంతా కలిసికట్టుగా కొట్లాడి మళ్లీ ఆయన్ను సీఎం చేయడమేలక్ష్యంగా పనిచేద్దాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే గిఫ్ట్’ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR).
Read Also: ప్రాణాలు తీస్తున్న ప్రధాన రహదారి
Follow Us On: Instagram


