ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి రిలీజ్ నుంచే  మిక్స్డ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ సాధించలేకపోయింది.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పెర్ఫామెన్స్‌తో అదరగొట్టినా.. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కథ పాతదే అయినా కథనంతో దర్శకుడు హరీశ్ శంకర్ మ్యాజిక్ చేయలేకపోయాడు.  ఇదిలా ఉంటే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్దం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్'(Netflix) వేదికగా ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా (Ustaad Bhagat Singh) స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మాలయాళ భాషలలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

Read Also: ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే .. స్పెషల్ పోస్టర్ రిలీజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>