గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే స్టవ్‌లలో సరికొత్త ఆవిష్కరణలు కూడా జరిగాయి. చాలా మంది ఇండక్షన్ స్టవ్ అంటే ఇంకొందరు గోబర్ గ్యాస్ అన్నారు. తాజాగా ఇప్పుడు మరో సరికొత్త స్టవ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి కేవలం నీళ్లు ఉంటే సరిపోతుంది. పైగా ఇది పొగను కూడా వెలువరించదు. ఇదే హైడ్రోజన్ స్టవ్ (Hydrogen Stove). నీటి ద్వారా తయారయ్యే ‘గ్రీన్ హైడ్రోజన్’ ఇంధనంతో వంట చేసే అద్భుత టెక్నాలజీ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. సిలిండర్ల అవసరం లేకుండానే వంట పని ముగించే ఈ సరికొత్త హైడ్రోజన్ స్టౌవ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మేడ్ ఇన్ ఇండియా స్టవ్ పూర్తిగా హైడ్రోజన్‌పైనే పనిచేస్తుంది. ఇది చూడటానికి సాధారణ స్టౌవ్‌లాగే ఉన్నా, దీని పనితీరు మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఇందులో కెటలిటిక్ బర్నర్లను వాడటం వల్ల మంట నేరుగా రాకుండా, వేడి మాత్రం సమానంగా అందుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో తయారైన ఈ యూనిట్‌ను నేరుగా ప్లగ్ చేసి వాడుకోవచ్చు. పర్యావరణానికి ఇది 100 శాతం సురక్షితం. దీని నుంచి విషపూరితమైన గ్యాస్ కానీ, పొగ గానీ రావు. శబ్దం కూడా చేయకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. భద్రత కోసం ప్రత్యేకంగా ఫ్లేమ్ అరెస్టర్లు, ప్రెజర్ రెగ్యులేషన్ సిస్టమ్‌ కూడా ఇందులో ఉంది.

ప్రస్తుతం ఒక యూనిట్ ధర దాదాపు లక్షా 50 వేల రూపాయలు ఉంది. అందుకే ఇది తక్షణమే ఇళ్లలోకి రాకపోయినా.. కమ్యూనిటీ కిచెన్లు, రక్షణ శాఖ క్యాంటీన్లు, ప్రభుత్వ పరిశోధనా కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నారు. ఇంధన ఖర్చును తగ్గించి, పర్యావరణాన్ని కాపాడే దిశగా ఈ హైడ్రోజన్ స్టౌవ్ (Hydrogen Stove) ఒక విప్లవాత్మక అడుగు. సిలిండర్ల యుగానికి స్వస్తి పలికి, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు కిచెన్ టెక్నాలజీ మారుతుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.

Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>