కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మలక్‌పేట్ – యాదగిరి థియేటర్ మధ్య ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు (Hyderabad Traffic Restrictions) జారీ చేశారు. ఈ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో నేటి నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల మలక్‌పేట్ (Malakpet), సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణ సమయాన్ని ముందే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐ.ఎస్. సదన్ వెళ్లే మార్గాన్ని పనుల నిమిత్తం ఒకవైపు పూర్తిగా మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను చంపాపేట్, ఎల్బీ నగర్ మీదుగా మళ్లించనున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు నల్గొండ ఎక్స్ రోడ్ మార్గానికి బదులుగా వీలైనంత వరకు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.
సైదాబాద్ (Saidabad), చంచల్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఇతర అంతర్గత రహదారుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రయాణంలో తలెత్తే ఇబ్బందులు లేదా అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ విభాగం ప్రత్యేకంగా 9010203626 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
Read Also: నేను విజయ్‌కి పెద్ద ఫ్యాన్ : అన్నామలై
Follow Us On: Sharechat


