కలం వెబ్ డెస్క్ : తమిళనాడులో దళపతి విజయ్ (Vijay) సినిమా జన నాయగన్ (Jana Nayagan) విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కేంద్రంలోని బీజేపీయే అడ్డుకుంటుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీజేపీ నేత అన్నామలై (Annamalai) స్పందించారు. బీజేపీ విజయ్ సినిమాను అడ్డుకుంటుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను విజయ్‌కి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. విజయ్ సినిమాలంటే తనకు కూడా ఇష్టమేనన్నారు. మరోవైపు విజయ్ సినిమాకు ఎదురవుతున్న ఇబ్బందులపై టీవీకే పార్టీ స్పందించింది.
రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ఈ సినిమాను అడ్డుకుంటుందని ఆరోపించింది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పందించారు. బీజేపీ విజయ్‌పై కక్షగట్టి ఆయన సినిమా విడుదల కాకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్ధతుగా నిలవడంపై టీవీకే నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.

Read Also: మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి వ్యోమగాములు
Follow Us On: Youtube


