కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (Uppal Stadium) జరగనున్న మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకుల కోసం పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సెల్ఫీ స్టిక్స్, ఇయర్ ఫోన్ బడ్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లను లోపలికి అనుమతించబోమని ప్రకటన చేశారు. వీటితోపాటు బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఆంక్షలు ఉంటాయని, అభిమానులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అభిమానులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ నిషేధిత వస్తువులను వెంట తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు. స్టేడియం (Uppal Stadium) వెలుపల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు (Police) హెచ్చరించారు. క్రీడాభిమానుల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలన్నారు.
Read Also: అందుకే కాలినడకన తిరుమలకు వెళ్తుంటా: జాన్వీ కపూర్
Follow Us On: Instagram

