Mobile Popup Ad
Mobile Popup Ad

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పోచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీమణి పుష్పతో పాటు కుమారులు డా. రవీందర్ రెడ్డి – డా. రాధిక దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి – సోని రెడ్డి దంపతులు, మనవరాళ్లు, మనుమలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>