కలం, వెబ్ డెస్క్: చాలామంది నటీనటులకు తిరుమల (Tirupati) తిరుపతి అంటే ప్రత్యేకమైన సెంటిమెంట్. సమయం దొరికినప్పుడల్లా శ్రీవారి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు తిరుమల తిరుపతి అంటే చెప్పలేనంత ఇష్టం. సాధారణ భక్తురాలిగా కాలినడకన వెళ్తూ శ్రీవారిని దర్శనం చేసుకుంటుంటారు. సెలబ్రిటీలకు వీఐపీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆమె మాత్రం సామాన్య భక్తురాలిలా కాలినడకన మెట్లెక్కి కొండపైకి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.
తాజాగా తిరుమల దర్శనంపై స్పందించారు. కాలినడకన వెళ్లడం వల్ల కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి మరింత దగ్గరైన అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక పయనం తన మనసుకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. భక్తిశ్రద్ధలతో మెట్లు ఎక్కి ఆ స్వామిని చేరుకోవడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నట్లు జాన్వీ (Janhvi Kapoor) పేర్కొన్నారు.
Read Also: ’చుక్ చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి‘.. చింపాజీల ట్రైన్ ఆట వీడియో వైరల్
Follow Us On: Instagram

