కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో భారీ అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ నెట్‌వర్క్‌లపై (Online Betting Networks) పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న 427 ప్రొఫైళ్లను , వీటికి సంబంధించిన 1903 యాడ్స్‌ను తొలగించారు. ఒక్క ఏప్రిల్‌లోనే 184 ప్రొఫైళ్లను గుర్తించగా, ఐపీఎల్ అంచనాలు, డీప్ ఫేక్ వీడియోలు, బోనస్ ఆఫర్లు, రిఫరల్ లింకులు ద్వారా వినియోగ దారులను ఆకర్షిస్తున్న 801 పెయిడ్ యాడ్స్‌ను సైతం గుర్తించి యాక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ ప్రచారాలకు పాల్పడుతున్న ప్రమోటర్లపై ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది.
తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పూర్తిగా చట్టవిరుద్ధమని, అధిక లాభాలు, ఈజీ రిటర్న్స్ పేరుతో వచ్చే ప్రకటనలు కేవలం మోసపూరితమైన ట్రాప్స్ మాత్రమేనని పోలీసులు హెచ్చరించారు. అక్రమ బెట్టింగ్ యాప్‌లను లేదా వెబ్‌సైట్‌లను ప్రచారం చేసినా, వాటి లింకులను ఇతరులకు షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం
Follow Us On: Instagram

