అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ బుర్రి చైతన్య

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని నగర మేయర్ బుర్రి చైతన్య (Mayor Burri Chaitanya) శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్‌లోని ప్రజా సమస్యల పరిష్కారానికి, మూల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిర ప్రత్యేక సహకారంతో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో నల్గొండ నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. డివిజన్లలో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు తదితర ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు.

సమావేశంలో పలువురు కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలోని వివిధ కాలనీల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సాధారణ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>