వలిగొండలో బాలల భద్రతపై న్యాయ సదస్సు

కలం, వలిగొండ: వలిగొండ మండల కేంద్రంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో “సురక్ష బచ్‌పన్ అభియాన్ – బాలల హక్కులు, పోక్సో చట్టం”పై న్యాయ అవగాహన సదస్సు (Legal Awareness Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సదస్సులో భాగంగా బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ హెల్ప్‌లైన్ 112, న్యాయ సహాయం కోసం 15100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అడ్వొకేట్ కొండూరు బాలరాజు, ప్రిన్సిపాల్ థామస్ అబ్రహం, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, అడ్వొకేట్లు కునూరు శ్రీనివాస్, సోమ సతీష్ రెడ్డి, ప్యానెల్ అడ్వొకేట్లు కనుగంటి శ్రీశైలం, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు కురిమేటి యాదయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>