దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన!

కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాలుస్తోంది. మరో 6 గంటల్లో ఇది వాయుగుండంగా మారి, రేపు సాయంత్రానికి తుఫాన్‌ (AP Cyclone)గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, సోమవారానికి ఇది ఏపీ తీరానికి చేరే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>