దేశ ఐక్యతకు పునాదులు వేసిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: భారతదేశాన్ని ఏకం చేసి అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే (MLA Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంతోపాటు, ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, సోన్, నిర్మల్ మండలాల అధ్యక్షులు మార గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, మాజీ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, ఎడిపెల్లి నరేందర్, నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, పొన్నం నారాయణ గౌడ్, కందుల హరీష్, గిల్లి విజయ్, జాప ప్రసాద్, ముత్యాల బంటి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>