టీడీపీలో కొత్త సంప్రదాయం.. రోజువారీ డిన్నర్ మీటింగ్‌లు

కలం, వెబ్ డెస్క్ : టీడీపీ (TDP) లో మరో కొత్త సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి పార్లమెంటు పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో రోజువారీ డిన్నర్ మీటింగ్‌లు (Daily Dinner Meetings) నిర్వహిస్తున్నారు. మొన్న పల్నాడు జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమం, నిన్న గుంటూరు జిల్లాలో కొనసాగగా, నేడు బాపట్ల జిల్లాలో డిన్నర్ మీట్ నిర్వహించారు.

గతంలో ఒక్కో పార్లమెంటు పరిధిలో పార్టీ నేతలతో ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత డిన్నర్ మీటింగ్‌ల ప్రధాన ఉద్దేశ్యం నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చర్చించడం, కార్యకర్తలు-నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించడం, అలాగే జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధుల సమన్వయం పెంచడం అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>