Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో సేవల పొడిగింపు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు (Hyderabad Metro) సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుని ట్రాఫిక్ ఇబ్బందులను నివారించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>