కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సంస్థ నగర వాసులకు ఓ రిక్వెస్ట్ చేసింది. మెట్రో స్టేషన్లు, రైలు పట్టాలకు దగ్గర్లో గాలిపటాలు ఎగరేయొద్దని కోరింది. ఎందుకంటే గాలిపటాలకు ఉండే మాంజా మెట్రో విద్యుత్ తీగలకు తగిలితే రైళ్లు ఆగిపోతాయని.. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరగొచ్చని తెలిపింది. నగరవాసుల ప్రయాణాలు సేఫ్ గా సాగాలంటే ఈ సంక్రాంతి సీజన్ లో గాలిపటాలను మెట్రోకు దరిదాపుల్లో ఎగరేయొద్దని కోరింది. రీసెంట్ గా గాలిపటాల మాంజా ముగ్గురి మెడ కోసేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: విజయ్ తో ప్రభాస్ పోటీ.. సౌత్ లో రాజాసాబ్ బలమెంత..?
Follow Us On: Instagram


