epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజయ్ తో ప్రభాస్ పోటీ.. సౌత్ లో రాజాసాబ్ బలమెంత..?

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తమిళ స్టార్ హీరో విజయ్ (Prabhas – Vijay) పోటీ పడుతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ జనవరి 9న వస్తోంది. అదే రోజు విజయ్ నటించిన చివరి మూవీ జననాయకుడు రిలీజ్ కాబోతోంది. రాజాసాబ్ కంప్లీట్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. విజయ్ సినిమా తండ్రి సెంటిమెంట్ తో పాటు పాలిటిక్స్, ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. రెండింటి రూట్ వేరే అయినా ఒకే రోజు రావడం.. పైగా ఇద్దరూ పెద్ద స్టార్లు కావడంతో అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైపోయింది.

విజయ్ కు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన ప్రతి సినిమాకు తెలుగులోనూ భారీగా వసూళ్లు వస్తున్నాయి. కానీ ప్రభాస్ కు తమిళంతో బలమైన మార్కెట్ లేదు. బాహుబలి తర్వాత వస్తున్న సినిమాలు అక్కడ మంచి కలెక్షన్లే రాబడుతున్నా.. విజయ్ సినిమాలు తెలుగులో కలెక్ట్ చేసినంత మాత్రం రావట్లేదు. కానీ కర్ణాటక, కేరళలో ప్రభాస్ సినిమాలకు ఉన్నంత మార్కెట్ విజయ్ సినిమాలకు లేదు.

పైగా నార్త్ లో ఇప్పటికీ ప్రభాస్ దే అప్పర్ హ్యాండ్. ఇలా మార్కెట్లను బట్టి వసూళ్లు వస్తాయని కూడా చెప్పలేం. ఎందుకంటే కంటెంట్ బాగుంటే మార్కెట్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద సినిమాలతో పోటీపడి చిన్న సినిమాలు కలెక్షన్లు రాబ్టటిన సందర్భాలు అనేకం. అయినా ది రాజాసాబ్, జన నాయకుడు సేమ్ రూట్ కాదు. కాబట్టి హారర్ కామెడీని కోరుకునే వారికి రాజాసాబ్ ఫస్ట ఛాయిస్ అవుద్ది. యాక్షన్ మోడ్ కోరుకునే వారికి జన నాయకుడు బెస్ట్ ఛాయిస్ అవుద్దేమో. ఇక ఇద్దరి అభిమానులు ఎవరి సినిమాలకు వారే వెళ్తారు. కాబట్టి ఎవరి సినిమా కంటెంట్ బాగుంటే వారిదే అప్పర్ హ్యాండ్ అవుద్ది.

Prabhas - Vijay
Prabhas – Vijay

Read Also:  మారుతి.. ఇది సాధ్యమేనా..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>