కలం, వెబ్ డెస్క్ : ప్యాకేజీలు దండుకోవడానికే జనసేన పార్టీ పెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి రోజా (Roja ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ గెలుపు ఒక గెలుపేనా అని ఆమె ప్రశ్నించారు. 21 స్థానాల్లో నిలబడితే అన్ని స్థానాలు గెలవడం చూస్తే అది ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నారు. రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన వ్యక్తి మళ్లీ గెలుస్తానని ధీమా ఉంటే మొదటిసారి పోటీ చేసిన నియోజకవర్గం కాకుండా ప్రతిసారి ఇతర ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారన్నారు.
ఆయనే ఒక పవర్ స్టార్ అయినప్పుడు కుటుంబం, ఇతర నటులతో ఎందుకు ప్రచారం చేయించారని ప్రశ్నించారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలలను తాను ఎక్కడా చూడలేదని జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల జెండా తప్ప అన్ని పార్టీల జెండా మోస్తారని ఎద్దేవా చేశారు. మీ నాయకుడి పార్టీ ఎవరికి ఉపయోగం? ఆయన ప్యాకేజీలు దండుకోవడానికి తప్ప పార్టీ ఆ పార్టీ ఎందుకు పనికిరాలేదని.. పవన్ కల్యాణ్ రాజకీయాలపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేశారని రోజా (Roja) ప్రశ్నించారు.
Read Also: కృష్ణా జలాలపై చంద్రబాబు అబద్దాలు.. బొత్స కామెంట్స్
Follow Us On: Pinterest


