కోహ్లీపై ప్రెగ్నెన్సీ ఆరోప‌ణ‌లు.. అంద‌రికీ షాకిచ్చిన యువ‌తి!

క‌లం, వెబ్ డెస్క్‌: విరాట్ కోహ్లీ (Virat Kohli) వ‌ల్ల ప్రెగ్నెంట్ అయ్యానంటూ హైద‌రాబాద్‌ (Hyderabad)కు చెందిన ఓ ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ పోస్ట్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో క్రికెట‌ర్‌ విరాట్ ఫ్యాన్స్ దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు నిజంగా విరాట్ అంత ప‌ని చేశాడా? అంటూ షాక‌య్యారు. దీనిపై సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌ద‌రు యువ‌తి మీడియా ముందుకొచ్చి తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకుంది. సోష‌ల్ మీడియాలో స్వాగీ గ‌ర్ల్ (Swaggy Girl) అనే అకౌంట్‌తో ఫేమ‌స్ అయిన స‌ద‌రు యువ‌తి తాను కేవ‌లం ప్ర‌మోష‌న‌ల్‌ కంటెంట్ కోస‌మే ఆ వీడియో చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

త‌ను ప్రెగ్నెంట్ కాద‌ని, గ‌ర్భం (Pregnancy) దాల్చిన‌ట్లు క‌నిపించేలా వ్యాక్స్ పెట్టుకొని వీడియో చేశాన‌ని ఆ యువ‌తి చెప్పింది. అస‌లు విరాట్ కోహ్లీ అన‌గానే అంద‌రు క్రికెట‌ర్ విరాట్ అని ఎందుకు అనుకున్నారంటూ ఎదురు ప్ర‌శ్నించింది. తాను ఎక్క‌డా క్రికెక‌ట‌ర్ విరాట్ (Virat Kohli) పేరు వాడ‌లేద‌ని, సోష‌ల్ మీడియాలో కూడా అత‌డ్ని మెన్ష‌న్ కానీ, ట్యాగ్ కానీ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చింది. స‌దరు యువ‌తి గ‌తంలో కూడా వైర‌ల్ అయ్యేందుకు అంద‌రినీ త‌ప్పుదోవ ప‌ట్టించేలా కంటెంట్ చేసిన‌ట్లు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ యువ‌తికి రిషి, స్వీటీ అని ర‌క‌ర‌కాల పేర్లున్నాయి. ఫేమ‌స్ కావ‌డం కోసం పెద్ద పెద్ద వాళ్ల పేర్లు అడ్డుపెట్టుకొని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

Read Also: ఈ అలవాట్లే ఆఫీసులో మీ ఇమేజ్‌ను తగ్గిస్తున్నాయ్‌..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>