జగన్ సొంతంగా ఒక్క ప్రాజెక్టూ తెచ్చింది లేదు: పయ్యావుల కేశవ్

కలం, వెబ్ డెస్క్: ఏపీకి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సొంతంగా ఒక్క ప్రాజెక్టూ తెచ్చింది లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఇటుక పెట్టి పని చేసింది లేదన్నారు. మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపంగా జగన్ మాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. జగన్‌కు అధికారం తప్ప ప్రజల ఆకాంక్షలు కనిపించవంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్ 3 రాజధానులకు అప్పటి సభ్యులు చప్పట్లు కొట్టారని అన్నారు. కేవలం బటన్ నొక్కడంతోనే ప్రజల బతుకులు సాగాలని జగన్ కోరుకున్నారని చెప్పారు. పురిట్లో బిడ్డను చంపినట్లు రాజధాని అమరావతిని జగన్ చంపాలని చూశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని ప్రజలు చేసిన పోరాటం తమ కళ్ల ముందు ఉందని చెప్పారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రం కష్టాలతో ఉన్న సమయంలో నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం తాము పని చేశామని వివరించారు.

తెలుగుజాతికి చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో తెలుగుజాతి బాగుండాలని చంద్రబాబు పడిన తపన తాము చూశామని అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఎప్పుడూ నిబ్బరం కోల్పోలేదని చెప్పారు. సీఎంగా ఉండి కూడా చంద్రబాబు బస్సులో పడుకున్నారని గుర్తు చేశారు. 53 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. అవతల వైపు ఎంతమంది మారినా.. ఇటువైపు చంద్రబాబు ఒక్కరే నిలబడ్డారని ఆనాటి రోజులను గుర్తు చేశారు. రాష్ట్రం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. 1995-2004 మధ్య చంద్రబాబు తెచ్చిన 63 ప్రాజెక్టుల్లో 2004 తర్వాత వైఎస్ 62 ప్రాజెక్టులను కొనసాగించారు కానీ, జగన్ మాత్రం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకించారని మంత్రి పయ్యావుల (Payyavula Keshav) మండిపడ్డారు.

Read Also: ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ప్పు చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>