కలం, వెబ్ డెస్క్: పుట్టుక నుంచే ఉద్యమంలో పెరిగామని, బెదిరింపులు తమకు లెక్క కాదని సింగర్ మధుప్రియ (Singer Madhu Priya) స్పష్టం చేశారు. ఎంత తొక్కితే అంత గట్టిగా లేస్తామని.. మేం ఆడపులులం, భయపడే ప్రసక్తే లేదని ట్రోలర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే తాము కేసీఆర్ (KCR) వారసులమని, తగ్గేదే లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం మొహం పెట్టుకుని, తెలంగాణలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. సింగర్ మధుప్రియ, యాంకర్ శివజ్యోతిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు రాజ్ బోడ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అత్యంత జుగుప్సాకర భాషలో వారిని దూషించడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
అమెరికాలో ఉండి తిడుతావా..?
బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మధుప్రియ (Singer Madhu Priya) పాటలు పాడుతండటాన్ని ఒక వీడియోలో ప్రశ్నించిన రాజ్ బోడ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆమె ఏమైనా వ్యాఖ్యలు చేస్తే విమర్శించవచ్చన్నారు. అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అమెరికాలో ఉండి నీచమైన భాషలో మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెల్లుతుందనుకుంటే పొరపాటేనని కామెంట్ చేస్తున్నారు. వెంటనే తెలంగాణ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి, అమెరికాలోనే ఆయన్ను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : దేవుడిపై ఒట్టు.. అంటూ అబద్ధాలతో ప్రజలను నమ్మించే యత్నం: డీకే అరుణ
Follow Us On: X(Twitter)

