అదో చెత్త సినిమా.. ‘ధురంధర్ 2’పై అసదుద్దీన్ హాట్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో భారత గూఢచారి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విడుదలైన కొద్ది రోజుల్లోనే భారతదేశంలో రూ.715 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1128 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పుడు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. ఈ చిత్రం కేవలం ‘బక్వాస్’ (అర్థం లేనిది) అంటూ హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీకి హోస్ట్ నుంచి ‘ధురంధర్ 2’ పై ప్రశ్న ఎదురైంది. దీనికి అసదుద్దీన్ ఒవైసీ సమాధానమిస్తూ.. అసలు అది ఒక సినిమానా?, చెత్త సినిమా అంటూ ఘాటుగా స్పందించారు. మూడు గంటల పాటు కేవలం బూతులు , మితిమీరిన హింసను చూపించడం తప్ప అందులో విషయం లేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ముస్లిం పాత్రలను చిత్రీకరించిన విధానంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రపంచమంతా ఈ సినిమాను చూసి సంతోషిస్తోంది కదా అని హోస్ట్ ప్రశ్నించగా.. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తనదైన హైదరాబాదీ యాసలో స్పందిస్తూ ఇలాంటి విషయాలను తాను అస్సలు పట్టించుకోనని తేల్చి చెప్పారు.

Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>