క్రీడలతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధ్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. బుధవారం వనపర్తి మండలం చిట్యాల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో (Chityala Gurukul School) నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో (Sports Meet) ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం, పెంచిన మెస్ ఛార్జీలు, నాణ్యమైన బోధన, అవసరమైన పుస్తకాలు, దుస్తులు అందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు.

క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, సర్పంచ్ సాలమ్మ బాలునాయక్, గ్రామ నాయకులు రఘుపతిరావు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>