సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య కాళ్లు న‌రికిన భర్త‌

క‌లం మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆవేశంలో భార్య కాళ్లను భర్త నరికేసిన ఘటన చౌటకూర్ మండ‌లం గంగోజిపేట్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దుర్గయ్య అనే వ్యక్తి తన భార్య వీరామణితో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన దుర్గయ్య గొడ్డలితో భార్య కాళ్లపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తండ్రి దుర్గయ్యపై కుమారుడు పుల్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>