Mobile Popup Ad
Mobile Popup Ad

హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

క‌లం, మెద‌క్ బ్యూరో : హుస్నాబాద్ (Husnabad) మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్-అఫిషియో సభ్యుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్న లావణ్య, భూక్యా సరోజన, మహమ్మద్ హసన్‌లను మంత్రి అభినందించారు. వారు హుస్నాబాద్ అభివృద్ధిలో చురుకుగా భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. మంత్రి మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>