తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు(Liquor License) దరఖాస్తులు దాఖలు చేయడానికి శనివారం అంటే అక్టోబర్ 18 ఆఖరు తేదీ. దీంతో శుక్రవారం భారీ సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇంకా క్యూలైన్లలో చాలా మంది దరఖాస్తు దారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మొదటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఆఖరు రోజున కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది అబ్కారీ శాఖ. అక్టోబర్ 23న లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు చేపట్టనున్నారు. ఆ తర్వాత లాటరీలో టెండర్ గెలుచుకున్న వ్యక్తికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. అన్ని అనుమతులతో లైసెన్స్‌లను(Liquor License) జారీ చేస్తుంది. అంటే ఈ టెండర్లలో గెలిచిన వ్యక్తి లైసెన్స్ 1 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027 వరకు వ్యాలిడ్ అవుతుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు కట్టాల్సిగా ప్రకటించింది. టెండర్ సక్సెస్ అయినా కాకపోయినా, లైసెన్స్ వచ్చినా రాకపోయినా.. ఈ దరఖాస్తు రుసుము అయితే కట్టి తీరాల్సిందే. ఈ అంశంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. లైసెన్స్ రాకుంటే రుసుము తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ విచారణలో ఉంది. ఇంతలోనే దరఖాస్తులు భారీగా నమోదవుతుండటం విశేషం.
Read Also: మోదీకి అమెరికన్ సింగర్ సపోర్ట్.. రాహుల్‌కు స్ట్రాంగ్ రిప్లై..

