epaper
Monday, November 17, 2025
epaper

పది మందిలో మాట్లాడలేకపోతున్నారా..? ఇదే కారణం కావొచ్చు..!

పబ్లిక్ స్పీకింగ్(Public Speaking).. కొంతమందికి ఇదొక పన్‌గా అనిపిస్తే.. ఇకొందరికి మాత్రం అదొప్పెద్ద యుద్ధం. అవును.. పది మంది ముందు నిల్చుని మాట్లాడాలి అంటే వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నోట మాట రాదు. అతి కష్టంపైన మాట్లాడినా.. చెప్పాలనుకున్నది ఏదీ గుర్తుకు రాదు. ఈ సమస్యపై స్టేజ్ ఫియర్ అంటారు. స్టేజ్ ఫియర్ అంటే వేదికపై నిల్చుంటేనే వచ్చేది కాదు. కొందరి ముందు నిల్చుని ఫ్రీగా నీ ఆలోచనను, చెప్పాలనుకున్న దానిని చెప్పడానికి పడే స్ట్రగుల్‌ను స్టేజ్ ఫియర్ అంటారు. దీనిని నుంచి బయట పడటానికి చాలా మంది ఎన్నో తిప్పలు పడుతుంటారు.

మరికొందరు అసలు తనకే ఇలా ఎందుకు అవుతుందని లోలోపల కుంగిపోతుంటారు. పది మంది మందు నిల్చుని మాట్లాడాలని ధైర్యం చేసి అక్కడకు వెళ్లినా.. అక్కడకు వెళ్లిన తర్వాత చేతులు చెమటపట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, మాటలు మరచిపోవడం, మాట తడబడటం, చిన్న వణుకు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి మీకే కాదు.. చాలా మంది ప్రఖ్యాతి చెందిన పబ్లిక్ స్పీకర్స్ కూడా ఎదుర్కున్న సమస్యలే. అయితే, ఇది సహజమైన భయం — దానిని అర్థం చేసుకొని క్రమంగా తగ్గించుకోవచ్చు. అసలు మనకు ఈ భయం ఎందుకొస్తుందో తెలుసా..

జడ్జ్ చేస్తారేమో అని భయం

అవును.. ఇది మీకు అనిపించకపోయినా.. సబ్‌కాన్షియస్‌గా మిమ్మల్ని ఇతరులు జడ్జ్ చేస్తారేమో అన్న భయం మీలో పాతుకుపోయి ఉంటుంది. “నేను తప్పు చెబితే వాళ్లు నవ్వుకుంటారేమో.. నన్ను తక్కువగా చూస్తారేమో. నన్ను వెక్కిరిస్తారేమో, నేను తక్కువగా కనిపిస్తానేమో’’ ఈ ఆలోచనలే అసలు మీలోని భయానికి పునాది వేస్తాయి. మనం గుంపు ముందు నిల్చుని ఉన్నంత సేపు ఈ ఆలోచనలు మనలో మెదులుతూనే ఉంటాయి. ఈ భయం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, మన మెదడు మనమే తప్పు చేస్తామన్న ఆలోచనలో ఇరుక్కుపోతుంది.

పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం..

మనం పలికే ప్రతి పదం, వాక్యం, చెప్పే ప్రతి విషయం అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం కూడా ఒక కారణం.కానీ మాట్లాడటం అనేది ఒక సహజ ప్రక్రియ. ఇలా ‘తప్పు చేయకూడదు’ అనే ఒత్తిడి పెరిగినప్పుడు, భయం కూడా పెరుగుతుంది. దానికి ఫలితంగా మాటలు రావు. తెలిసిన విషయాలనూ అప్పుడు మర్చిపోతాం. దాని వల్లా ఇంకా ఎక్కువ తప్పులు దొర్లడం జరుగుతుంది. అది మన భయాన్ని మరింత పెరుగుతుంది.

గత అనుభవాల ప్రభావం

గతంలో ఎదుర్కొన్న అనుభవాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మనం పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్‌లో కానీ, ఆ తర్వాత కాలేజీ సమయంలో కానీ మాట్లాడినప్పుడు ఎవరైనా నవ్వినా, మధ్యలో ఆపినా లేదా తప్పుపట్టినా.. ఆ అనుభవం మనసులో గాఢంగా మిగిలిపోతుంది. అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న ఆలోచన ఊబిలా మనల్ని లోపలికి లాక్కెళ్తుంది.

ప్రమాదంగా భావించడం..

పబ్లిక్ స్పీకింగ్(Public Speaking) సమయంలో శరీరం దాన్ని ఒక “ప్రమాద పరిస్థితి”గా గుర్తిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు, కాళ్లు కంపించడం, నోరు ఎండిపోవడం ఇవన్నీ సహజమైన ప్రతిస్పందనలు. కానీ దీని అర్థం మీరు బలహీనులని కాదు. ఇది మన శరీరం మనసును రక్షించడానికి చేసే సహజ చర్య. మనం దానిని తప్పుగా అర్థం చేసుకుని.. మాట్లాడలేకపోతాం.

అనుభవం లేకపోవడం

అనుభవం లేకపోవడం కూడా మనం మాట్లాడలేకపోవడానికి ఒక కారణం. మీరు తరచుగా పబ్లిక్ ముందు మాట్లాడే(Public Speaking) అవకాశం పొందకపోతే, మెదడు ఆ పరిస్థితిని కొత్తగా, ప్రమాదకరంగా భావిస్తుంది. చిన్న చిన్న గ్రూపులతో మొదలుపెట్టి క్రమంగా పెద్దవారితో మాట్లాడటం ద్వారా ఈ భయం తగ్గించవచ్చు.

సెల్ఫ్ ఫోకస్ ఎక్కువగా ఉండటం

పబ్లిక్ ముందుకు వెళ్లగానే.. నేను ఎలా కనిపిస్తున్నాను? నా వాయిస్ రేంజ్ కరెక్ట్‌గా ఉందా? నా వాయిస్ బాగుందా? ఆడియన్స్‌కు నచ్చుతుందా? ఇలా మనపై ఎక్కడలేని దృష్టి పెట్టడం కూడా మనకు మైనస్‌గా మారుతుంది. ఇది మనలో టెన్షన్‌ను అధికం చేస్తుంది. ఫలితంగా జనం ముందుకు వెళ్లగానే నోటమాట రాదు. దానికి బదులు, మీరు చెబుతున్న విషయంపై, వినిపిస్తున్న వాళ్లకు అది ఎంత ఉపయోగపడుతుంది అనే దానిపై దృష్టి పెట్టండం మంచిది. అప్పుడు భయం తగ్గుతుంది.

కాన్ఫిడెన్స్ లేకపోవడం

జనం ముందుకు వెళ్లి మాట్లాడకముందే ‘నేను చేయలేను? నా వల్ల కాదు’ అని అనుకోవడం. మీపై మీకే నమ్మకం లేకపోవడం వల్ల మీ మెదడు కూడా దానినే నిజం అని నమ్మేస్తుంది. దాని వల్ల మీలో టెన్షన్ పెరిగుతుంది. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం అంటే మీకు మీమీద నమ్మకం ఉండటం. రోజూ కాస్త కాస్తగా ప్రాక్టీస్ చేస్తే, ఈ నమ్మకం బలపడుతుంది.

ఇతరులతో పోల్చుకోవడం..

ప్రతి విషయంలో ఇతరులతో పోల్చుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు జనం ముందు మాట్లాడలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మీరు మాట్లాడితే.. దానిని ఆడియన్స్ ఇతరులతో పోలుస్తారు అని అనుకుని.. మిమ్మల్ని మీరే పోల్చుకుంటారు. పలానా వాళ్లు ఎలా మాట్లాడారు? నేను ఎలా మాట్లాడాను? ఎవరిది బాగుంది? ఇలా ఇతరులు ఎంత బాగా మాట్లాడారో చూసి మనతో పోల్చుకోవడం కూడా భయానికి కారణం. ప్రతి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది. మీ శైలి మీది అని మీరు నప్పినప్పుడు ఈ భయం పోతుంది.

అయితే ఇవేవీ కూడా పుట్టకతో వచ్చి మరణం వరకు ఉండేవి కాదు. కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా మనలో వచ్చేవి. కానీ, క్రమంగా ప్రయత్నించడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ భయాన్ని మనం అధిగమించవచ్చు. ఏది చేయాలంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు చేయగలరని ఎవరో కాదు.. అందరికన్నా ముందు మీరు నమ్మాలి. అప్పుడు ఏదైనా సాధ్యమతుంది.

Read Also: అమ్మాయికి నచ్చాలంటే ఏం చేయాలో తెలుసా..?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>