కలం, వెబ్‌డెస్క్: మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆకలి వేసినపుడు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. ఆకలిగా ఉన్నప్పుడు చిన్నవిషయాలకే చిరాకు పడతారు, కోప్పడతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ఈ స్థితిని Hangry (Hungry + Angry) అని కూడా అంటారని చెబుతున్నారు నిపుణులు. ఆకలి అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదట, దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరానికి ఆహారం అత్యంత అవసరమైన ప్రాథమిక అవసరం. శరీరాన్ని చురుకుగా, శక్తివంతంగా ఉంచడానికి నీటితో పాటు ఆహారం కూడా అవసరం. అయితే ఆకలి మన మానస్థిని ఎలా ప్రభావితం చేస్తుందో (Hunger Affects) తెలుసుకుందాం.
చిరాకు మరియు ఆందోళన
ఆకలి వేసినపుడు కొంతసేపు ఆహారం తీసుకోకపోతే, శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుందట. అయితే గ్లూకోజ్ అనేది మెదడుకు ముఖ్యమైన ఇంధనంలా పనిచేస్తుంది. ఈ స్థాయి తగ్గినప్పుడు మెదడు సరిగా పనిచేయదు. దీనివల్ల శక్తి తగ్గుతుంది. మూడ్ మారుతుంది. చిరాకు పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరం ఒత్తిడి హార్మోన్లు విడుదల చేస్తుంది. కార్టిసాల్ (Cortisol) – ఒత్తిడిని పెంచే హార్మోన్, నలిన్ (Adrenaline) – శరీరాన్ని fight or flight స్థితికి తీసుకెళ్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మనకు ఆకలిగా ఉన్నప్పుడు కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
డిప్రెషన్ లాంటి ఫీలింగ్
ఎక్కువ సమయం ఆకలితో ఉండడం వలన నీరసం వస్తుంది. దీనివల్ల ఏ పని చేయాలన్నా ఉత్సాహం నశిస్తుందని చెబుతున్నారు.
ఆకలి తీరితే… ఆనందం వస్తుంది!
మనం ఆహారం తిన్న వెంటనే మెదడులో ‘డోపమైన్’ (Dopamine), ‘సెరోటోనిన్’ (Serotonin) అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయట. ఈ హార్మోన్లు మన మూడ్‌ను మార్చి ప్రశాంతంగా ఉండేలా చేస్తామని చెబుతున్నారు నిపుణులు.

