కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. అల్లరి మూకలు ఇప్పటికే నలుగురు హిందువులను బలి తీసుకోగా, సోమవారం మరో హిందూ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన దక్షిణ బంగ్లాదేశ్‌లో జరిగింది. జెషోర్ జిల్లా అరువ గ్రామంలో నివసించే రాణా ప్రతాప్ బైరాగి (38) ఐస్ ఫ్యాక్టరీ నడుపుతూ, ఒక డైలీ పేపర్‌కు తాత్కాలిక ఎడిటర్ (Bangladesh Hindu Journalist) గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐస్ ఫ్యాక్టరీలో రాణా ప్రతాప్ ఉండగా, మోటార్ బైక్‌పై వచ్చిన దుండగులు అతడిని బయటకు రప్పించి, కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో తలలో బుల్లెట్లు దిగి, ఆయన అక్కడికక్కడే చనిపోయారు.
ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై మరోసారి తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అయితే, రాణా ప్రతాప్ పై పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పగా, వాటన్నింటిలోనూ అతను నిర్దోషిగా తేలాడని ప్రతాప్ పనిచేస్తున్న పత్రిక న్యూస్ పేపర్ యజమాని అబుల్ తెలిపారు. హత్యకు కారణాలు తెలియదని అబుల్ చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి హిందువులపై దాడులు, హత్యలు కొనసాగుతుండగా తాత్కాలిక ప్రభుత్వం నడుపుతున్న మహ్మద్ యూనస్ మాత్రం పట్టించుకోవడం లేదు.

Read Also: ఐపీఎల్ పై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం..
Follow Us On: Sharechat


