కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా జాతీయ రహదారిపై అపూర్వ ఘటన చోటు చేసుకుంది. వెండి ఆభరణాల (Silver Ornaments) ను తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న అభరణాలు రోడ్డుపై పడడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమాచారం తెలుసుకున్న వెంటనే రహదారిపై పెద్ద ఎత్తున జనం గుమిగూడి.. చెల్లాచెదురుగా పడిన ఆభరణాల (Silver Ornaments) ను ఏరుకున్నారు. వాహనాలను ఆపడంతో ఆ మార్గం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలంలో పోలీసులు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లుగా మారింది. ఆభరణాలకోసం జనం పోటీపడడంతో తొక్కిసలాట జరిగింది.
కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు భారగా పెరుగుతున్నాయి. అమెరికా – వెనెజువెలా మధ్య కొనసాగుతున్న రాజకీ, ఆర్థిక సంక్షోభంతో వెండి, బంగారం రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోమవారం భారత మార్కెట్ లో కిలో వెండి రూ. 2,43,000 చేరింది.
In UP’s Hapur, commuters scramble to loot Silver ornaments which fell from a truck on the highway. pic.twitter.com/CCuOtwLFln
— Piyush Rai (@Benarasiyaa) January 5, 2026
Read Also: వచ్చే వారం భారత్కు జర్మనీ ఛాన్సలర్
Follow Us On: Pinterest


