epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐపీఎల్ పై బంగ్లాదేశ్​ సంచలన నిర్ణయం..

కలం, వెబ్​ డెస్క్​ : బంగ్లాదేశ్​లో ఐపీఎల్​ ప్రసారాలను నిషేధిస్తూ (IPL Ban) ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ (Bangladesh) లో హిందువులపై జరుగుతున్న వరుస హింసాకాండలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ.. ఐపీఎల్​ టోర్నీలో కోల్ కత్తా నైట్​ రైడర్స్​ జట్టుకు చెందిన బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ముస్తఫిజుర్​ ను కోల్​ కత్తా నైట్​ రైజర్స్​ తప్పించింది.

ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బంగ్లాదేశ్​ ప్రభుత్వ ఐపీఎల్​ ప్రసారాలను బ్యాన్​ (IPL Ban) చేసింది. ఆ దేశానికి చెందిన ఆటగాడు ముస్తఫిజుర్​ రెహమాన్​ ను రిలీజ్​ చేయడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ లో ఐపీఎల్​ ప్రసారాలు నిలిచిపోతున్నాయి. అంతకు ముందు భారత్​, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్​ టోర్నమెంట్ లో భారత్ వేదికలపై తాము ఆడబోమంటూ ఐసీసీకి లేఖ రాసింది. తాజా పరిణామాలతో భారత్​, బంగ్లా మధ్య దూరం పెరుగుతోంది.

Read Also: జేడీ వాన్స్​ నివాసంపై దాడి.. ఒకరి అరెస్ట్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>