శానిటరీ ప్యాడ్స్(Sanitary Pads) వాడకం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, వాటివల్ల క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. వీటితో మహిళల్లో ఆందోళన తీవ్రతరం అవుతోంది. అయితే ఈ విషయంలో కచ్ఛితమైన శాస్త్రీయ నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉంది. అసలు అధ్యయనాలు ఇలా ఎందుకు చెప్తున్నాయి అంటే.. బయట లభించే అనేక శానిటరీ ప్యాడ్స్ తయారీలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు వంటి హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. అవి శానిటరీ ప్యాడ్‌లు ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తాయి. వీటి వల్లే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందనే అధ్యయనాలు చెప్తున్న మాట. ప్రస్తుతం మనకు మార్కెట్లో లభించే దాదాపు అన్ని శానిటరీ ప్యాడ్స్‌లో ఇటువంట హానికరమైన కెమికల్స్‌ను వినియోగిస్తారు. శానిటరీ ప్యాడ్స్ ఎక్కువ రోజులు ఉండాలన్న ఆలోచనతోనే సంస్థలు వీటిని వినియోగిస్తున్నాయి. అయితే వీటి తయారీలో వాడే థాలేట్స్ యుక్తవయసులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తాయి.
అంతేకాకుండా వీటి వల్ల సంతానోత్పత్తి విషక్ష్ంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెప్తోంది. మరోవైపు శానిటరీ ప్యాడ్ల(Sanitary Pads) వినియోగంతో క్యాన్సర్ రాదని, కానీ కొన్ని సార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం ఉందని, అందువల్లే నెలసరి సమయంలో మెన్‌స్ట్రువల్ కప్స్ వినియోగించుకోవాలని గైకాలజిస్ట్‌లు అంటున్నారు.
Read Also: విటమిన్-Dకి మెదడుకు లింకేంటి..?

