హై అలర్ట్.. ప్రధాని మోదీ వెళ్లే దారిలో పేలుడు పదార్థాల కలకలం..!

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో తెలంగాణ పర్యటనకు రానున్న వేళ ఆయన ప్రయాణించే మార్గంలో జిలిటెన్ స్టిక్స్ బయటపడటం కలకలం రేపుతోంది. బెంగళూరులోని కగ్గళిపుర ప్రాంతంలో జిలిటెన్ స్టిక్స్ ను పోలీసులు కనుగొన్నారు. ప్రధాని మోదీ ప్రయాణించే మార్గానికి అతి సమీపంలో ఈ పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంది.

పేలుడు పదార్థాల ఉనికిని గుర్తించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రహస్య ప్రాంతంలోకి విచారిస్తున్నారు. ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఏవైనా కుట్రలు పన్నారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన వేళ జిలిటెన్ స్టిక్స్ వెలుగు చూడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>