రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు పెను ప్రమాదం తృటితో తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఒక పక్కకు ఒరిగింది. హెలీప్యాడ్ కుంగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది.. హెలికాప్టర్‌ను పక్కకు పెట్టించారు. దీంతో ప్రమాదం తృటిలో తప్పింది. ద్రౌపది ముర్ము తన నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా బుధవారం శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. అయ్యప్పను దర్శించుకున్న అనంతరం ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఆమె కొచ్చిలోని స్టేడియంకు హెలికాప్టర్‌లో ప్రయాణించారు. అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: లక్ష్మీ నాయుడు హత్య కేసుపై సీఎం ఆరా..

