కలం, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై నిరసన గళం విపినిస్తూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లను దహనం చేయాలని పేర్కొంది. ఈ నెల 8 లేదా 9 తేదీలలో టౌన్ హాల్ సదస్సులు నిర్వహించాలని తెలిపింది. 12 తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని పేర్కొంది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడింది. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించింది. ఈ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేసింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైయస్ఆర్‌సీపీ (YSRCP) ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Read Also: ఏపీలో కోల్డ్ వార్.. ఒకేరోజు టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు
Follow Us On : WhatsApp

