Mobile Popup Ad
Mobile Popup Ad

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎబోలా కలకలం: ప్రయాణికుడిలో లక్షణాలు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ (Ebola Virus) కలకలం రేపింది. సూడాన్ దేశం నుండి వచ్చిన మొహమ్మద్ అనే ప్రయాణికుడిలో ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు గుర్తించారు. విమానాశ్రయంలోని ప్రత్యేక హెల్త్ స్కానర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్య బృందాలు, విమానాశ్రయ అధికారులు అతడిని ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించారు. ప్రస్తుతం ఆ ప్రయాణికుడిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆ వ్యాధి ఎబోలా (Ebola) అవునా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి వైద్యులు ప్రయాణికుడి శరీరం నుండి రక్త నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం అందింది. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు సాగే ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

Read Also: కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకో నీతి.. బాల్క సుమన్‌కు ఒక నీతా?: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>