Mobile Popup Ad
Mobile Popup Ad

టోల్‌గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా (Annamayya District)లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే టోల్‌గేట్ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్ప‌డ్డారు. అనుచ‌రుల‌తో క‌లిసి మ‌హిళ‌ల‌ను సైతం చిత‌క‌బాదారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు (Amilineni Surendra Babu) శ‌నివారం త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కారులో వెళ్తున్నారు. వాల్మీకిపురం మండ‌లంలోని గండ‌బోయిన‌ప‌ల్లె టోల్ గేట్‌ ద‌గ్గ‌ర‌కు రాగానే టోల్‌గేట్ సిబ్బంది ఎమ్మెల్యే కారును ఆపారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్ర‌హానికి గుర‌య్యారు. కారు దిగి అధికార‌ పార్టీ ఎమ్మెల్యే కారునే ఆపుతారా అంటూ అనుచ‌రుల‌తో క‌లిసి టోల్‌ సిబ్బందిపై దాడి చేశారు. మహిళల‌పై కూడా దాడికి పాల్ప‌డ్డారు. ఎమ్మెల్యే అనుచ‌రులు టోల్‌గేట్‌ మేనేజర్ రవిని కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read Also:  నన్ను అన్యాయంగా ఇరికించారు: అనంతబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>