కేసీఆర్ లేకపోతే BRS లేదు.. BRS లేకపోతే తెలంగాణే లేదు: హరీశ్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ పుట్టడం వల్లే నేడు దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయంపాలనలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదని.. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదని ఆయన అన్నారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. గుడి కమిటీ ఆహ్వానం మేరకు హరీశ్ రావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. ‘ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతుందన్నా, మన సిద్దిపేట జిల్లా ఏర్పడిందన్నా అదంతా కేసీఆర్ కృషే. బీడువారిన ఈ నేలను ఇవాళ కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయంటే దానికి కారణం తెలంగాణ రావడం, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని స్థాపించడమే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నాటి ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ సాధన కోసం 4 కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయిన మహానాయకుడు కేసీఆర్. గుడి కమిటీ ఆహ్వానం మేరకు దుద్దెడ చౌడాలమ్మ దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ పండుగ నిర్వహణ కోసం నా వంతుగా ఆర్థిక సహాయం అందజేశాను. గతంలో ఇక్కడి ప్రజల అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం కేసీఆర్ రూ. 30 లక్షల నిధులు మంజూరు చేశారు.’ అని తెలిపారు.

Read Also: భయంకరమైన ఎల్ నినో.. మళ్లీ రాబోతుందా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>