కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) బెంగాల్ లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్ గావ్ పట్టణంలో పర్యటించారు. “గంగోత్రి నుంచి గంగా నది జన్మించినట్లుగానే.. జన సంఘ్ నుంచి బీజేపీ పుట్టింది. ఆ జన సంఘ్ పుట్టింది బెంగాల్ లోనే. అంటే బీజేపీ మూలాలు ఇక్కడే ఉన్నాయి. జన సంఘ్ తొలి ఎంపీగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కోల్ కతా నుంచి గెలిచారని గుర్తు చేశారు. విభజన తాలూకు గాయాలను జన సంఘ్ కూడా అనుభవించింది. ఎక్కడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయకపోయినా.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుల తరఫున బలంగా నిలబడి కొట్లాడింది” అన్నారు.
వారి కోసమే సీఏఏ తెచ్చాం..
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ శరణార్థుల గొంతుగా ఉండేవారని ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసించారు. ఆయన నేర్పిన విలువలను బీజేపీ నేటికీ ఆచరిస్తోందన్నారు. విభజన కాలం నుంచి ఇప్పటివరకు శరణార్థుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా తీసుకున్నట్లు వివరించారు. అందుకోసమే మోదీ సీఏఏ చట్టాన్ని తెచ్చాడని తెలిపారు. “మథువా, నమస్ దుర వంటి శరణార్థి వర్గాల వారికి పౌరసత్వం అందజేస్తాం. మీకు ఇక్కడ శాశ్వత నివాసాన్ని కూడా కల్పిస్తాం. ధ్రువపత్రాలు అందించడంతో పాటు మిగతా భారతీయుల్లాగానే మీకు అన్ని రకాల హక్కులు ఉంటాయి. ఇది మోదీ గ్యారంటీ” అని స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్ లేకపోతే BRS లేదు.. BRS లేకపోతే తెలంగాణే లేదు: హరీశ్
Follow Us On : WhatsApp

