కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ బియ్యం (Philippines Rice) ఎగుమతిలో స్కాం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడి కేసుల్లో ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్ పెట్టుకున్నది నిజమా కాదా చెప్పండి? అంటూ డిమాండ్ చేశారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం నిజమా కాదా? అంటూ ఫైర్ అయ్యారు. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తామని ఎంఓయూ చేసుకున్నామని, ఇదేదో పెద్ద ఇంటర్నేషన్ అగ్రిమెంట్ అని, తమ విజయం అని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు అదొక పెద్ద స్కాంగా మారిందన్నారు. 10 లక్షల టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకున్న మీరు, 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయారు? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయి ఉన్న మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
ఎందుకు ఏడాది నుంచి పోర్టులో ఉందని.. ఎందుకు ఎగుమతి ఆగిపోయింది? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న తమ అడ్వైజర్ ఎక్కడ పోయాడని ఫైర్ అయ్యారు. వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణమా? అని ఆరోపించారు. సివిల్ సప్లైస్‌లో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేయాలని.. వీటిని ఆధారలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన పారదర్శకంగా ఉన్నదని మీరు భావిస్తే, మీరు తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ముందుకు రావాలి అంటూ అధికార కాంగ్రెస్ సభ్యులను డిమాండ్ హరీశ్ రావు (Harish Rao) చేశారు. లేదంటే మీరు తప్పు చేసినట్లుగానే రాష్ట్ర ప్రజలు భావిస్తారని అన్నారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది ఖాయమని.. ఈ కుంభకోణాలపై విచారణ జరిపించేది ఖాయమని స్పష్టం చేశారు.
Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు
Follow Us On: Youtube

