రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల‌కు పోలీసుల‌ నోటీసులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న వైసీపీ (YSRCP) నేత‌ల‌కు పోలీసులు నోటీసులు పంపించారు. రాష్ట్రంలో ర్యాలీలు, దీక్ష‌ల‌కు అనుమ‌తి లేద‌ని నోటీసుల‌లో పేర్కొన్నారు. ఆంక్ష‌లు విస్మ‌రించి ఎవ‌రైనా ర్యాలీలు, దీక్ష‌లు చేప‌డితే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఏపీ మెగా డీఎస్సీలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ గ‌త కొద్ది రోజులుగా వైసీపీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే డీఎస్సీ నియామ‌కాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని, విద్యా శాఖ మంత్రి లోకేశ్ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>