కొరత లేదంటూనే.. కోతలు, వాతలు

కలం, తెలంగాణ బ్యూరో: “గ్యాస్ కొరత లేదు.. పెట్రోల్ రేట్లు పెంచట్లేదు..ఎవరూ భయపడాల్సిన పనిలేదు..” ఇవీ కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు! ఈ మాటలు జనానికి భరోసా ఇవ్వకపోగా, మరింత ప్యానిక్‌కు గురిచేస్తున్నాయి. కేంద్రం చెప్తున్న మాటలకు, గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేదు. ఒకవైపు కమర్షియల్ సిలిండర్ల (Commercial Cylinders) డెలివరీ (LPG Supply) ఇంకా గాడిన పడలేదు. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లూ టైమ్‌కు అందడంలేదు. దీనికి తోడు వాటి రేట్లను కేంద్రం పెంచింది. ఇంకో వైపు పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచేసింది. ఢిల్లీ లాంటి ఏరియాల్లోనూ కట్టెల పొయ్యి వాడకంపై ఇంతకాలమున్న నిషేధాజ్ఞలను తొలగించింది. “పొగచూరుతున్న బతుకుల్లో వెలుగులు నింపేది గ్యాస్..” అంటూ ప్రమోట్ చేసిన పాలకులే ఇప్పుడు బ్యాక్ టు ‘కట్టెల పొయ్యి’ అంటున్నారు. ఈ చర్యలన్నీ.. ఏదో జరగబోతున్నదన్న ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి.

బుక్ చేసి వారం పది రోజులైనా సిలిండర్​ అందట్లేదు. ఏజెన్సీల ముందు జనం ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయోనన్న టెన్షన్‌తో బంకుల ముందు క్యూ కడుతున్నారు. దీనికి తోడు చాయ్ మొదలు నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి. చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. సామాన్యుడి జీవితం భారంగా మారుతున్నది. పట్నం నుంచి పల్లె దాకా ఇప్పుడు అంతా ‘బ్యాక్ టు కట్టెల పొయ్యి’. ఒకప్పుడు ఇంటి పెరట్లోని కట్టెలను ఎక్కడ పడేయాలో అర్థంకాక తలలుపట్టుకున్న జనమే.. ఇప్పుడు ఆ కట్టెల కోసం మండీల చుట్టూ తిరుగుతున్నారు. కట్టెల రేట్లు డబుల్ అయ్యాయి. కొన్ని చోట్ల వాటికీ షార్టేజే. సందట్లో సడేమియా తరహాలో.. విమాన టికెట్ల ధరల పెంపుపై ఇంతకాలం ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తేయడంతో ఆ రేట్లూ పెరిగిపోనున్నాయి. క్షేత్రస్థాయి కష్టాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

LPG Supply
LPG Supply

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>